- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధర్నా చౌక్‌లో ప్రారంభమైన జర్నలిస్టుల ‘‘మహాధర్నా’’
దిశ, ముషీరాబాద్: అర్హత ఉన్న జర్నలిస్టులు అందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, హైద్రాబాద్‌లోని హౌసింగు సొసైటీలకు వారి ఆధీనంలో ఉన్న భూములను వారికే ఇవ్వాలని, ఏ సొసైటీలో మెంబర్షిప్ లేని జర్నలిస్టులకు ప్రత్యేక విధానం ద్వారా స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా ప్రారంభమైంది.
ఈ ధర్నాలో జిల్లా కేంద్రాలు, నియోజక వర్గాలు, మండల స్థాయి జర్నలిస్టులకూ హౌజ్ సైట్స్ ఇవ్వాలని, జర్నలిస్టుల సమస్యలను సర్కారు సానుభూతితో అర్థం చేసుకుని పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాకు మద్దతుగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తదితరులు హాజరుకానున్నట్లు టీడబ్ల్యూజేఎఫ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాంచందర్, ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్యలు తెలిపారు.