- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lb Nagar కమలంలో కల్లోలం.. సామ రంగారెడ్డికి పోటీగా రంగంలోకి సీనియర్ నాయకులు
దిశ, ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గం కమలం పార్టీలో కలకలం రేగింది. ఎన్నికల వేళ బీజేపీకి పలువురు సీనియర్ నాయకులు దూరమయ్యారు. ఎల్బీనగర్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు.
సామ రంగారెడ్డి 2019లో టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పువ్వు పార్టీలో చేరారు. అయితే 30 ఏళ్లుగా బీజేపీ కోసం కష్టపడి పని చేసిన నాయకులను పక్కన పెట్టారు. దీంతో సామ రంగారెడిపై ఎల్బీనగర్ 11వ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది సీనియర్ నాయకులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సామ రంగారెడ్డి ఒంటెద్దు పోకడతోను తాము బీజేపీకి దూరమయ్యామంటూ ప్రచారం చేస్తున్నారు.
దీంతో ఎల్బీనగర్‌లో బీజేపీకి భారీ డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు. ప్రతి డివిజన్‌లో సుమారు 4 వేల నుంచి 5 వేల ఓట్లు క్రాస్ అయ్యే చాన్స్ ఉందని చెబుతున్నారు. దీని వల్ల బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డికి ఎఫెక్ట్ తప్పదని, మూడో స్థానానికి పరిమితమవుతారనే ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.