- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యాయవాది పై దాడి కేసును ఛేదించిన పోలీసులు..
దిశ, కార్వాన్ : న్యాయవాది పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసిన సంఘటన కలకలం రేకెత్తించింది. ఎట్టకేలకు సెంట్రల్ జోన్ పోలీసులు కేసును ఛేదించి ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. బుధవారం ఏసీపీలు సంజయ్, చంద్రశేఖర్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో వివరాలను వెల్లడించారు. కళ్యాణ్ వంశీకర్ అనే న్యాయవాది పై కత్తులతో దాడి చేసిన కేసును సెంట్రల్ జోన్ పోలీసులు ఛేదించారు. మంగళవారం ఉదయం ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు న్యాయవాది కళ్యాణ్ తన పెంచుకుంటున్న కుక్కతో కలిసి వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఇద్దరు అతనిని అటకాయించి తన మొబైల్ ఇవ్వాలని అడిగారు. కళ్యాణ్ ప్రతిఘటించడంతో నిందితులు తమ వెంట తెచ్చుకున్న కత్తితో అతని పై దాడి చేశారు.
చేయి అడ్డుపెట్టడంతో చేతికి గాయాలు అయ్యాయి. ఈ దాడిలో సెల్ ఫోన్ కింద పడిపోగా దాన్ని తీసుకొని ద్విచక్ర వాహనం పై దుండగులు పారిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని రెండు బృందాలుగా ఏర్పడి, సీసీ కెమెరాల ఆధారంగా ముషీరాబాద్ కు చెందిన మైనర్, అస్మాబాద్ బండ్ల గూడకు చెందిన మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా ఈ ఇద్దరు నిందితులు న్యాయవాది పై దాడి చేయడానికంటే ముందు గన్ ఫౌండ్రిలోని ప్రసాద్ అపార్ట్మెంట్ లో పనిచేసే శ్రీకారన్ ఢమాల్ వాచ్మెన్ పై దాడి చేసి సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. దీంతో ఆ ఇద్దరు మైనర్లను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి చోరీ చేసిన రెండు సెల్ ఫోన్లు, చోరీకి వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరు మైనర్లను కోర్టుకు హాజరు పరిచినట్లు అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, సైఫాబాద్ ఏసీపీ సంజయ్ తెలిపారు. కాగా ముషీరాబాద్ కి చెందిన మైనర్ గతంలో సెల్ ఫోన్ దొంగతనం కేసులో జైలుకు వెళ్ళివచ్చాడని పోలిసులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో అబిడ్స్ డీఐ నరసింహ, ఖైరతాబాద్ డీఐ సైదులు, ఇన్స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డి, రాజశేఖర్, ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.