డాటాఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

by Kalyani |   ( Updated:2022-12-14 18:20:39.0  )
డాటాఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రెండవ దశ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఔట్ సోర్సింగ్ విభాగంలో పని చేసేందుకు గాను డాటాఎంట్రీ ఆపరేటర్ల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య శాఖలో డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా ఐదు నెలల పాటు పని చేసేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన వారికి నెలకు రూ. 19,500 వేతనం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు htps://forms.gle/txbkhWZCbtsc71Ny6 వెబ్ సైట్లో పేర్కొన్న వివరాలను పూర్తి చేసి అప్ లోడ్ చేయాలని సూచించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను డౌన్ లోడ్ చేసుకుని విద్యార్హతల సర్టిఫికెట్లను వాటికి జతచేసి జిల్లా వైద్యాధికారి కార్యాలయం, 4వ అంతస్తు, జీహెచ్ఎంసీ భవనం, ప్యాట్నీ సెంటర్ లో ఈ నెల 16వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమర్పించాలని కోరారు. ఇతర వివరాలకు జిల్లా అధికారిక వెబ్ సైట్ www.hyderabad.telangana.gov.in నుంచి పొందవచ్చని డాక్టర్ వెంకటి తెలిపారు.

READ MORE

ఇరిగేషన్‌లో 879 కొత్త పోస్టులు.. 8 ఏండ్ల తర్వాత భర్తీకి మోక్షం

Advertisement

Next Story