- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చార్మినార్ చుట్టున్న కమాన్‌లకు మహర్దశ
దిశ, సిటీ బ్యూరో: చారిత్రక హైదరాబాద్ నగర వారసత్వ సంపదను కాపాడేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. నగర చారిత్రక వైభవానికి నిలువెత్తు సంతకమైన చార్మినార్ పరిసర ప్రాంతాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు జీహెచ్ఎంసీ తనవంతు కృషి చేస్తుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ వద్ద నిధుల్లేకపోయినా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద చార్మినార్ చుట్టున్న నాలుగు కమాన్లకు సోబుగులు దిద్దేందుకు జీహెచ్ఎంసీ సుమారు రూ. 9 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సీఎస్ఆర్ కింద ఈ పనులు చేపట్టేందుకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఆసక్తి చూపటంతో బల్దియా త్వరలోనే నాలుగు కమాన్లు పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దనుంది. ఇప్పటికే చార్మినార్‌కు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు కొనసాగుతున్న పనులకు సమాంతరంగా ఈ నాలుగు కమాన్ల పునరుద్ధరణ కూడా చేపట్టాలని బల్దియా భావిస్తుంది. ఈ పనులు చేపట్టేందుకు రూ.9 కోట్లలో తక్కువగా కోడ్ చేసే ఏజెన్సీలను ఎంపిక చేయాలని బల్దియా భావిస్తుంది. ఈ పునరుద్ధరణ పనులు చేయటంతో పాటు మూడేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించే ఏజెన్సీకే పనులు కేటాయించాలని కూడా జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
పునరుద్దరణ పనులిలా...
చార్మినార్ చుట్టూ నాలుగు దిక్కుల్లో ఉన్న నాలుగు కమాన్ల పునరుద్ధరణ పనులను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా నాలుగు కమాన్లపై చార్మినార్ చిహ్నం కల్గిన నాలుగు ఆకర్షనీయమైన మినార్లను ఏర్పాటు చేయనున్నారు. అందమైన లేజర్ కట్ చేయబడిన విద్యుత్ దీపాలతో ఆలంకరించనున్నారు. మదీనా చౌరస్తా నుంచి చార్మినార్ వరకు దారి పొడువున డెకెరేటీవ్ ఎలిమినేట్స్‌తో ముస్తాబు చేయనున్నారు. అందమైన, ఆకర్షనీయమైన పోల్స్‌ను మినార్ల రూపంలో మలిచి, వాటిలో తెల్లటి వెలుగులు వచ్చే ఈ కమాన్లపై ఏర్పాటు చేయనున్నారు. మదీనా చౌరస్తాలో ఎలక్ర్టిక్ లైటింగ్‌తో స్పెషల్ ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేయనున్నారు. కృత్రిమ పామ్ ట్రీలను మదీనా క్రాస్ రోడ్డు నుంచి చార్మినార్ వద్దనున్న మసీదు వరకు ఏర్పాటు చేయనున్నారు. ఈ లైట్లకు సంబంధించిన కరెంటు బిల్లులను జీహెచ్ఎంసీనే భరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కృత్రిమ కళాఖండాలకు బీమాను చేయించనున్నట్లు తెలిసింది. నాలుగు ఔట్ డోర్ స్టెయిన్ లెస్ స్టీల్ డండోలియన్ ఫ్లవర్స్‌ను ఒక్కో కమాన్ పై కనిష్టంగా రెండున్నర నుంచి మూడు మీటర్ల ఎత్తు వరకు వైట్, బ్లూ కలర్స్‌లో ఏర్పాటు చేయనున్నారు. కమాన్లపై అమర్చే ఏడు మీటర్ల ఎత్తు కల్గిన డెకరేటీవ్ అల్యూమినియంతో తయారు చేసిన 10 పోల్స్‌లను ఏర్పాటు చేసి, ఒక్కో పోల్‌కు ఫోర్ వే కనెక్టర్‌ను అమర్చి 120 వాట్స్ సామర్థ్యం కల్గిన 40 లైట్లు, 90 వాట్స్ సామర్థ్యం కల్గిన 271 లైట్లు, అలాగే 60 వాట్స్ సామర్థ్యం కల్గిన 13 ఎల్ఈడీలను అమర్చనున్నారు.