వ్యాధులు రాకుండా ఫాగింగ్ చేపట్టాలిః జీహెచ్ఎంసీని ఆదేశించిన కలెక్టర్

by Nagam Mallesh |
వ్యాధులు రాకుండా ఫాగింగ్ చేపట్టాలిః జీహెచ్ఎంసీని ఆదేశించిన కలెక్టర్
X

దిశ, హైదరాబాద్ బ్యూరోః వ్యాధులు ప్రబలకుండా కాలనీలలో ఫాగింగ్ చేపట్టాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఆజమాబాద్ లోని ఎస్ఆర్ టి నగర్ కాలనీని బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాలనీలోని పార్క్, ప్రక్కనే ఉన్న నీది కుంటను కలెక్టర్ పరిశీలించి అక్కడ ఉన్న చెత్తను, పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. నీరు నిలుస్తున్న గుంతలలో మట్టిని నింపి నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు. దోమల నియంత్రణకు యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టాలని అన్నారు. ట్రీ కటింగ్ చేపట్టాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఇంటింటికీ వెళ్లి పరిసరాలను పరిశీలించారు. ప్రతి ఇంటిలో తడి చెత్త, పొడి చెత్త వేరు వేరు డస్ట్ బిన్లలో వేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాని, చెత్తను ఇంటి బయట పారవేసే వారిని గుర్తించి జరిమానా వేయాలని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జిహెచ్ఎంసి సిబ్బంది ప్రతిరోజు శానిటేషన్ చేపట్టాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కె రవి చారి, సికింద్రాబాద్ ఆర్డిఓ దశరథ్ సింగ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మోహిద్దీన్, ఏ హెచ్ ఎమ్ ఓ డాక్టర్ హేమలత, జిహెచ్ఎంసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed