- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hyderabad: సీఐ అయి ఉండి ఇదేం పని..?.. మహిళా డాక్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు
దిశ తెలంగాణ క్రైం బ్యూరో: ఓ వైపు వరుసగా జరుగుతున్న వీధి కుక్కల దాడులతో జనం భయం భయంగా కాలం గడుపుతుంతే ఓ ఇన్స్పెక్టర్తన పెంపుడు కుక్కలతో ఇరుగుపొరుగు వారిని భయపెడుతున్నారు. ప్రజలను కాపాడాల్సిన వృత్తిలో ఉండి ఇదేం పని అని ప్రశ్నిస్తే తాను సీఐనని.. తనకు ఇష్టం వచ్చినట్టు చేస్తానని..ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ దురుసుగా మాట్లాడారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్పోలీసులు సదరు ఇన్స్పెక్టర్పై కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతంలోని చిత్రా లే అవుట్‌లో ఉన్న మంజీరా హైట్స్ అపార్ట్‌మెంట్ డీ బ్లాక్‌లో పోలీస్ ఇన్స్‌పెక్టర్ నాగేంద్రరావు నివాసముంటున్నారు. ఆయన ఇంట్లో రెండు కుక్కలను పెంచుకుంటున్నారు. వాటిని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఇరుగుపొరుగు వారి పైకి ఉసిగొల్పుతుండటంతో వాళ్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమకేదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఇరుగుపొరుగువారు చెబితే ‘నా ఇష్టం వచ్చినట్టు చేస్తా...దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ సదరు సీఐ దురుసుగా సమాధానాలు ఇస్తున్నట్టు అపార్ట్‌మెంట్‌వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యంతరం చెప్పిన పాపానికి వారం రోజుల క్రితం ఇదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఓ గైనకాలజిస్టు పైకి సదరు సీఐ తన కుక్కలను ఉసిగొల్పినట్టు చెప్పారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు కూడా అయ్యిందన్నారు. దాంతో బాధితురాలు ఎల్బీనగర్పోలీస్స్టేషన్ఫిర్యాదు చేసిందని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తమతో చెప్పారని తెలిపారు.