మున్నూరు కాపు ఆధ్వర్యంలో ప్రగతి భవన్ వద్ద ధర్నా

by Sridhar Babu |   ( Updated:2023-08-29 09:19:46.0  )
మున్నూరు కాపు ఆధ్వర్యంలో ప్రగతి భవన్ వద్ద ధర్నా
X

దిశ, ఖైరతాబాద్ : రాజకీయంగా పెద్దపీట వేసి తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మున్నూరు కాపు ఆత్మగౌరవ మహా ధర్నా సేన రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్గె శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ సంవత్సరానికి 5000 కోట్లతో మున్నూరుకాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహాన్ని ఎండోన్మెంట్ బోర్డు నుండి తొలగించి మున్నూరు కాపులకు అప్పగించాలి అన్నారు. మున్నూరుకాపు ప్రతి కుటుంబానికి కుల వృత్తుల సహాయం కింద రూ. 5 లక్షలు కేటాయించాలన్నారు.

వ్యవసాయం భూములు కోల్పోయిన రైతులకు 3 ఎకరాల భూమిని కేటాయించాలన్నారు. ఈ డబ్లు ఏస్ ప్రకారంగా మున్నూరుకాపులకు ప్రత్యేక 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, లేదా బీసీడీకి 23శాతం రిజర్వేషన్ కలిపించాలి అని డిమాండ్ చేశారు. మున్నూరుకాపు పండించిన పంటకే బీమాను అందించి ప్రకృతి నుండి దళారులనుండి రైతులను ఆదుకోవాలన్నారు. మున్నూరుకాపుల పై చదువులకు స్కాలర్షిప్ ప్రకటించాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు కటిక మహేష్ కుమార్ , బత్తుల రాములు , రామిని సందీప్ , బత్తుల శ్రీనివాస్ , మల్లేష్ , అనిల్ , స్వామి సంఘ నాయకులతో పాటు ధర్నాలో పాల్గొన్న మొత్తం 50 మందిని అరెస్టు చేసి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

Next Story