- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : ఎమ్మెల్యే ముఠా గోపాల్

దిశ, ముషీరాబాద్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని, దానిని సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం రాత్రి భోలక్‌పూర్ డివిజన్ ఇందిరానగర్‌లో 9 మంది లబ్దిదారులకు సంబంధించి 4 లక్షల 96 వేల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై లబ్దిదారులకు చెక్కులను అందచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యాలకు గురై ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం తీసుకున్న పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ పేరిట ఆదుకుంటుందన్నారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహ, భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ రావు, నాయకులు మునావర్ చాంద్, జునేద్ బాగ్దొది, శంకర్ గౌడ్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.