- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM Revanth Reddy : ఆధార్ లేదని విద్యకు దూరమైన చిన్నారి.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లోని సనత్ నగర్లోని ఓ బస్తీకి చెందిన చిన్నారి శ్రీవిద్య(SriVidhya)కు ధృవీకరణ సర్టిఫికెట్లు లేని కారణంగా పాఠశాలలో చేర్చుకోలేదంటూ గురువారం సామాజిక మాధ్యమాలలో ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అయింది. చిన్నారికి బర్త్ సర్టిఫికెట్(Birth Certificate), ఆధార్(Adhar) లేకపోవడంతో పాఠశాలలో అడ్మిషన్ కు నిరాకరించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త విపరీతంగా వైరల్ అయింది. బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) కూడా చిన్నారికి కావాల్సిన పత్రాలు జారీ చేయాలని అధికారులను కోరారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వరకూ వెళ్లడంతో ఆయన విచారణకు ఆదేశించారు. హుటాహుటిన సనత్ నగర్ చేరుకున్న అధికారులు శ్రీవిద్య బడి మానేయడానికి గల కారణాలను కనుక్కొని సీఎంకు నివేదించారు. అయితే ఆ చిన్నారి పాఠశాలకు వెళ్లకపోవడానికి సర్టిఫికెట్లు లేకపోవడం కారణం కాదని విచారణలో తెలినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. కుటుంబ కారణాల వల్లే బడి మానేసిందని అన్నారు. కాగా అధికారులు తిరిగి ఆ బాలికను స్కూల్లో చేర్పించారని, బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నట్టు సీఎం వెల్లడించారు.