సీఈఐఆర్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలి

by Sridhar Babu |
సీఈఐఆర్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలి
X

దిశ, మెహిదీపట్నం : సెల్ ఫోన్లు చోరీకి గురైతే వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకుంటే సులభంగా దొరుకుతాయని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం ఆయన చోరీకి గురైన, పోగొట్టుకున్న 22 సెల్ ఫోన్లను బాధితులకు లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఈఐఆర్ పోర్టల్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ ఆధ్వర్యంలో

లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్, ఎస్సై రాఘవేంద్ర స్వామి, సిబ్బంది రవికుమార్, వల్లపు కృష్ణ, సాగర్, కాంతి సాయి ఆధ్వర్యంలో టెక్నికల్ గా విచారణ జరిపి 22 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రఘుకుమార్, ఏసీపీ సయ్యద్ ఫయాజ్, ఎస్సైలు సత్య నరేంద్ర, రాఘవేంద్ర స్వామి, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story