మియాపూర్‌లో మహిళ దారుణ హత్య

by Mahesh |   ( Updated:2024-09-30 14:01:06.0  )
మియాపూర్‌లో మహిళ దారుణ హత్య
X

దిశ, శేరిలింగంపల్లి: ఒంటరిగా ఉంటున్న మహిళ హత్యకు గురైన దారుణ ఘటన సోమవారం ఉదయం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు స్పందన (29) కుటుంబ కలహాలతో భర్తతో విడిపోయి మియాపూర్ సీబీఆర్ ఎస్టేట్ లోని ప్లాట్ నెంబర్ 110 లో ఒంటరిగా ఉంటుంది. సోమవారం ఉదయం ఆమె ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెను దారుణంగా హత్య చేశారు. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ఈ హత్య జరిగి ఉంటుందని మృతురాలి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయని, ప్రస్తుతంలో కోర్ట్‌లో విడాకుల కేసు నడుస్తుందని ఆమె బంధువులు చెబుతున్నారు. కాగా మహిళ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ హత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed