HYD: వాళ్లు అనర్హులు.. అందుకే తిరస్కరించారు: MP K.Laxman

by srinivas |
HYD: వాళ్లు అనర్హులు.. అందుకే తిరస్కరించారు: MP K.Laxman
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిఫార్సుల విషయంలో గవర్నర్ తమిళి సై నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సమర్థించారు. ఎమ్మెల్సీ సిఫార్సు చేసిన వారు ఆర్టికల్ ప్రకారం అనర్హులని ఆయన తెలిపారు. ఈ విషయంలో కల్లకుంట్ల కుటుంబానికి అసహనం పెరిగిందని, గవర్నర్‌పై పోటీ పడి మరీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ తప్పులను ఎత్తి చూపితే ప్రధాని మోదీపై కుల్వకుంట్ల ఫ్యామిలీ అక్కసు వెళ్లగక్కుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను విమర్శిస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వమని, లిక్కర్ ప్రభుత్వమని లక్ష్మణ్ విమర్శించారు. గ్రూప్ వన్ ఎగ్జామ్‌ను సైతం ప్రభుత్వం సరిగా నిర్వహించకపోయిందన్నారు. దళిత బంధుకు రూ.10 లక్షలకు ఇస్తే బీసీలకు మాత్రం లక్షమాత్రమే ఇస్తున్నారని ఆక్షేపించారు. బీసీ సబ్ ప్లాన్‌ను ఇప్పటివరకూ ఎందుకు అమలు చేయలేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తారా? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను అడ్డంపెట్టుకుని కోట్లు దోచుకుంటున్నారని లక్ష్మణ్ ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed