- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral Video : అత్యవసరంగా వెళ్తున్న అంబులెన్స్.. పోలీసుల చెకింగ్స్ లో షాకింగ్ విషయం

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా అంబులెన్సులో అత్యవసర చికిత్స అవసరమైన వారిని ఆసుపత్రికి, లేదా ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి తరలిస్తారు. కాని అంబులెన్సులో ఓ పెట్ డాగ్ ను, అది కూడా సైరన్ మోగిస్తూ అతివేగంగా తీసుకువెళ్ళిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. హైదరాబాద్(Hyderabad) మహానగరంలో అదొక రద్దీ మార్గం. వాహనాల తాకిడి ఎక్కువగా ఉండే పంజగుట్ట సర్కిల్. అంత్యత రద్దీలోనూ ఒక అంబులెన్స్ సైరన్ మోతతో అతివేగంగా వెళుతోంది. సిగ్నల్ వద్ద ఆగిన అంబులెన్స్ లో ఉన్నవారి పరిస్థితిని కనుక్కునేందుకు అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నం చేశారు. ఆ అంబులెన్స్ డోర్ తీసి చూడగా.. అందులో ఉన్నవారిని చూసి షాక్ అయ్యారు. మియాపూర్‌లోని ఆస్పత్రిలో ఓ పెంపుడు కుక్కకు వేసెక్టమీ చేయించేందుకు అంబులెన్స్ లో సైరన్ తో తీసుకువెళ్తున్నాడు సదరు డ్రైవర్, కుక్క యజమాని. విషయం తెలుసుకున్న పోలీసులు పెంపుడు కుక్క యజమాని, డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ సైరన్ దుర్వినియోగం చేస్తున్నాడని డ్రైవర్ పై, కుక్క యజమాని మీద కేసు నమోదు చేశారు. రోగులను అత్యవసర సమయంలో తరలించాల్సిన అంబులెన్సులను ఇలా దుర్వినియోగం చేయరాదని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.