కేసీఆర్​ దళిత ద్రోహి: సంపత్ కుమార్​

by srinivas |   ( Updated:2023-04-06 16:04:10.0  )
కేసీఆర్​ దళిత ద్రోహి: సంపత్ కుమార్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్​ దళిత ద్రోహి అని ఏఐసీసీ కార్యదర్శి సంపత్​ కుమార్​ పేర్కొన్నారు. గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్​విగ్రహాన్ని ముట్టుకునే అర్హత కేసీఆర్​కు లేదన్నారు. జయంతి, వర్ధంతిలను అధికారికంగా ఇప్పటి వరకు నిర్వహించలేదన్నారు. దీంతో 125 అడుగుల అంబేద్కర్​విగ్రహావిష్కరణకు కేసీఆర్​ను అనుమతించకూడదని పేర్కొన్నారు. దళితులను మోసం చేయాలని కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని వాడుకొని దళితులను దగా చేయాలని కేసీఆర్​ ప్లాన్​ చేస్తున్నారని ఆరోపించారు. నేరెళ్ల, మరియమ్మ లాకప్​డెత్​ల ఘటనలను ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్​మాట తప్పారని గుర్తు చేశారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి కేసీఆర్ తొమ్మిదేళ్ల పాపాలను కడుక్కోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

టీపీసీసీ ఎస్సీ సెల్​ చైర్మన్ ​ప్రీతం మాట్లాడుతూ కేసీఆర్ దళితులకు చేసిన ద్రోహంపై ఈ నెల 14న ఛార్జిషీట్ విడుదల చేస్తామన్నారు. దళితబంధును బీఆర్​ఎస్​ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed