- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్గెస్ట్ ప్లేట్ బిర్యానీని ప్రారంభించిన నటుడు సోనూసూద్..
దిశ, శేరిలింగంపల్లి: తాను వెజీటేరియన్ ఫుడ్ మాత్రమే తింటానని కానీ, తన పేరు మీద నాన్ వెజ్ బిర్యానీ రావడం సంతోషంగా ఉందని నటుడు సోనూ సూద్ అన్నారు. శనివారం కొండాపూర్ లోని జిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం అనాథ చిన్నారులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ.. విభిన్న రుచులకు కేరాఫ్ గా నిలుస్తున్న హైదరాబాద్ నగరంలో ఇప్పుడు తన పేరు మీద ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేట్ బిర్యానీని తీసుకొస్తున్నందుకు జిస్మత్ మండి నిర్వాహకులు గౌతమి, ధర్మా, గౌతమ్ లను అభినందించారు. నగరంలో ఎన్నో థీమ్ రెస్టారెంట్లు వస్తున్నాయని, అనునిత్యం కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు వస్తున్న రెస్టారెంట్లు మంచి భోజనం అందిస్తే మంచి ఆదరణ లభిస్తుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఎనిమిద ఫీట్ల విస్తీర్ణం ఉండే ఈ ప్లేట్‌లో ఒకేసారి 15 నుంచి 20 మంది భోజనం చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. దేశంలోనే ఎక్కడా కూడా ఇంత పెద్ద ప్లేట్ లేదని వారు తెలిపారు. త్వరలోనే విజయవాడ, గుంటూరు, నెల్లూరు, బెంగళూరులలో ఉన్న అన్ని బ్రాంచీల్లో సోనూసూద్ బిగ్గెస్ట్ ప్లేట్ బిర్యానీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ హిమజ తదితరులు పాల్గొన్నారు.