సాగర్ కాంప్లెక్స్ లో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ ....

by Disha Web Desk 11 |
సాగర్ కాంప్లెక్స్ లో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ ....
X

దిశ, ఎల్బీనగర్ : వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ కాంప్లెక్స్ లో గంజాయి బ్యాచ్ పండ్ల వ్యాపారులపై మారణ ఆయుధాలతో మూకుమ్మడిగా దాడి చేయడమే కాకుండా పండ్ల షెడ్డును తగలబెట్టిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. సంఘటన స్థలంలో తెలిసిన వివరాల ప్రకారం… చంద్రాయన గుట్టకు చెందిన షఫీ అహ్మద్ ఖాన్, సాదిక్ అలీ, మహబూబ్ పాషా, బాబా ఫక్రుద్దీన్ లు సాగర్ కాంప్లెక్స్ జాతీయ రహదారి పక్కన ఫారెస్ట్ స్థలంలో షెడ్డు ఏర్పాటు చేసుకుని గత కొన్ని నెలల నుంచి పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు.

ఇటీవల గత నెల సుమారు 20 మంది గంజాయి బ్యాచ్ షాప్ పై దాడి చేసి వ్యాపారి దగ్గర 20వేల రూపాయలు బలవంతంగా తీసుకెళ్లడంతో బాధితులు గత నెల 19వ తారీఖున వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మళ్లీ మీ షాపు వద్దకు వస్తే 100కు డయల్ చేయండి అని పోలీసులు సమాధానం చెప్పి పంపించారని బాధితులు వెల్లడిస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత గంజాయి బ్యాచ్ మళ్ళీ పండ్ల వ్యాపారుల నుంచి దౌర్జన్యంగా డబ్బును తీసుకెళ్లారు. అంతే కాకుండా మా పై ఫిర్యాదు చేస్తున్నరంట మీ అంతు చూస్తాం అంటూ బెదిరించారు. ఈరోజు ఆదివారం మధ్యాహ్నం పండ్ల వ్యాపారి వద్దకు వచ్చి మీ అంతు చూస్తాం బిడ్డ మా మీద నువ్వు ఫిర్యాదులు చేస్తున్నావని తెలిసింది.

సాయంత్రం వస్తాము నీ సంగతి చెప్తామని చెప్పి వెళ్లిపోయారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు సుమారు పదిమంది మళ్లీ పండ్ల షెడ్డు వద్దకు వచ్చి మారణ ఆయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగకుండా పెట్రోల్ తీసుకుని పండ్ల షెడ్డును తగలబెట్టారు. సాగర్ కాంప్లెక్స్ పండ్ల వ్యాపారి షెడ్డు తగలబడుతుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలు అయిన బాధితులను ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు స్పందించి ఉంటే మాకు ఈ ప్రమాదం జరిగేది కాదు ....

గత నెల 15, 19 తారీఖున వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో మాపై గుర్తుతెలియని గంజాయి బ్యాచ్ దాడి చేయడమే కాకుండా మా వద్ద ఉన్నటువంటి వేలాది రూపాయలను బలవంతంగా ఎత్తుకెళ్లారని మాకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు స్పందించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని బాధితులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ముందు లబోదిబోమంటూ కంటతడి పెట్టారు. పోలీసులు నిర్లక్ష్యం వల్లనే ఈ గంజాయి బ్యాచ్ మాపై దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గంజాయి బ్యాచ్ అడ్డ సాగర్ కాంప్లెక్స్ లోని పెట్రోల్ బంక్ వెనుక వీరు స్థావరం.

సాగర్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలలో సుమారు 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల యువకులు ఫ్లై టెక్ ఏవియేషన్ అకడమిక్ ఎదురుగా ఉన్నపెట్రోల్ బంక్ వెనకా స్థలంలో స్థావరం ఏర్పాటు చేసుకొని, ప్రతిరోజు గంజాయి సేవిస్తూ అటుగా వెళ్లే వారిని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా ఆ సాగర్ కాంప్లెక్స్ లోని ఫారెస్ట్ స్థలంలో మలమూత్ర విసర్జనకు వెళ్లే వ్యక్తులను బెదిరించి వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ లను విలువైన బంగారు ఆభరణాలను డబ్బులను దౌర్జన్యంగా వారిపై దాడి చేసి లాక్కుంటున్నారని ఇలాంటి వారిపై ఇకనైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ఉక్కు పాదం మోపాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story