హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక సూచన

by M.Rajitha |
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక సూచన
X

దిశ, వెబ్ డెస్క్ : నిన్నటి నుండి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. కాగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఆదివారం సూర్యాపేట, కోదాడలో సంభవించిన భారీ వరదల వల్ల ఆయా జిల్లాల ఉన్నతస్థాయి పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారంతో ఈ ప్రకటన జారీ చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లోని రామాపురం వద్ద వంతెన కూలిపోవడం, ఖమ్మం-సూర్యాపేట రహదారిపై పాలేరు వద్ద తీవ్ర వరద ప్రవాహం వలన, అలాగే చింతకల్లు, నందిగామ వద్ద ఎన్హెచ్ 65 జాతీయ రహదారి కొట్టుకుపోవడం వలన రెండు రాష్ట్రాల మధ్య రేపటి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసరం అయితే విజయవాడ వెళ్ళేవారు చౌటుప్పల్- నార్కట్ పల్లి - నల్గొండ- పిడుగురాళ్ల- గుంటూరు మీదుగా వెళ్లాలని తెలిపారు. ఖమ్మం వెళ్ళేవారు చౌటుప్పల్-నార్కట్ పల్లి- అర్వపల్లి - తుంగతుర్తి- మరిపెడ బంగ్లా మీదుగా వెళ్లాలని సూచించారు. ఇక ఎక్కడైనా ఈ మార్గంలో వరదలో చిక్కుకుంటే 9010203626 అత్యవసర నంబర్ కు కాల్ చేయాలని పోలీసులు తెలియ జేశారు.

Next Story

Most Viewed