కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్.. క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి

by Satheesh |   ( Updated:2024-05-14 15:20:51.0  )
కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్.. క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: జూన్ 2 వరకే హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుందని.. ఆ తర్వాత హైదరాబాద్‌ను బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతం చేస్తుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత చేయకుండా అపగలిగే శక్తి ఒక్క బీఆర్ఎస్‌కు మాత్రమే ఉందన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌పై కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ఉద్దేశం బీజేపీకి లేదని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు సిగ్గులేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్నీ కుట్రలు చేసిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed