HYD: గన్‌తో కాల్చుకుని MP అసదుద్దీన్ ఒవైసీ బంధువు ఆత్మహత్య

by GSrikanth |   ( Updated:2023-02-27 12:08:08.0  )
HYD: గన్‌తో కాల్చుకుని MP అసదుద్దీన్ ఒవైసీ బంధువు ఆత్మహత్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో తుపాకీతో కాల్చుకుని ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మజార్ (60) అనే డాక్టర్ గన్ తో కాల్చుకున్నాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు అతడిని జూబ్లీహిల్స్ అపోలోకు తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపారు. మృతుడికి లైసెన్స్ కలిగిన వెపన్ ఉందని దానితోనే షూట్ చేసుకున్నాడా లేక మరో వెపన్ ఉపయోగించాడా అనేది దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ప్రస్తుతానికి ఒక రౌండ్ మాత్రమే ఫైర్ జరిగినట్లు క్లూస్ టీమ్ గుర్తించిందని ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ మరిన్ని ఆధారాలు సేకరిస్తోందన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని, అయితే అతడి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మజార్ పై గతంలో డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా ఉందని జోయల్ డేవిస్ పేర్కొన్నారు. కాగా మృతుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీకి బంధువు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఒవైసీ బ్రదర్స్ అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed