TGSRTC: మానవతామూర్తులు.. ఆర్టీసీ ఉద్యోగులు! ఎందుకంటే? సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
TGSRTC: మానవతామూర్తులు.. ఆర్టీసీ ఉద్యోగులు! ఎందుకంటే? సజ్జనార్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో ఫిట్స్‌తో అస్వస్థతకు గురైన ప్రయాణికురాలికి వెంటనే వైద్యం అందించేందుకు ఓ ఆర్టీసీ డ్రైవర్ బస్సును ఏకంగా స్థానిక ప్రభుత్వ తీసుకువెళ్లాడు. ఆలస్యం చేయకుండా హాస్పిటల్‌కు తరలించిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులను పలువురు అభినందిస్తున్నారు. ఈ ఘటనపై మంగళవారం టీవీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

మానవతామూర్తులు.. మన ఆర్టీసీ ఉద్యోగులు.. అంటూ ఫొటో షేర్ చేశారు. ఫిట్స్‌తో అస్వస్థతకు గురైన ప్రయాణికురాలిని బస్సులో నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లి.. వైద్యం అందించిన టీవీఎస్ ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు.. అని పేర్కొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారి ఆపద సమయంలో మేమున్నామంటూ ఆర్టీసీ ఉద్యోగులు సేవాతత్పరత చాటుతుండటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Next Story

Most Viewed