- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hot News: సభ్యత్వ రద్దు వేటు పడేది ఎవరిపై..! ఆ ఆరుగురు ఎవరు?
దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్ గులాబీ లీడర్లలో చర్చకు దారి తీశాయి. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు బీఆర్ఎస్ లీడర్లు సభా నిబంధనలను ఉల్లంఘిస్తూ పదే పదే పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరడజను మంది సభ్యత్వాలను రద్దు చేయాలంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ కామెంట్ గులాబీ లీడర్లలో గుబులు పెంచుతున్నది. ఏయే ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం ఆ వ్యాఖ్య చేశారు. పదే పదే పోడియం వద్దకు వెళ్లి, విమర్శలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరు? కేవలం విపక్ష సభ్యులను భయపెట్టేందుకే సీఎం అలా మాట్లాడారా? లేక నిజంగానే ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తారా? అనే చర్చ బీఆర్ఎస్ నేతల్లో మొదలైంది.
సభ్యత్వాల రద్దు తప్పదా?
ఒకవేళ సభ్యత్వాలను రద్దు చేయాలని స్పీకర్ భావిస్తే, ముందుగా జరిగేHot News: సభ్యత్వ రద్దు వేటు పడేది ఎవరిపై..! ఆ ఆరుగురు ఎవరు? కసరత్తు ఏ విధంగా ఉంటుందనే చర్చ సైతం గులాబీ లీడర్లలో మొదలైంది. ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు సరైన ఆధారాలు చేతికి వచ్చిన తర్వాత సమయం, సందర్భం చూసుకుని సభ్యత్వాలను రద్దు చేసే చాన్స్ ఉన్నట్టు సమాచారం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీలో (2014-18) నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను అప్పటి స్పీకర్ రద్దు చేశారు. ఇదే విషయాన్ని ఇటీవల సీఎం రేవంత్ ప్రస్తావించారు. గతంలో ఉన్న సంప్రదాయాలను సైతం స్పీకర్ దృష్టిలో పెట్టుకుని రూల్స్‌ను అతిక్రమించిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తారనే సంకేతాలు ఇచ్చారనే చర్చ జరుగుతున్నది.
గత సెషన్‌లోనూ ఇదేతీరు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతేడాది డిసెంబర్‌లో 6 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా 9 రోజుల పాటు సెషన్ నడిచింది. ఈ రెండు సమావేశాల్లోనూ కొందరు బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనపై విమర్శలున్నాయి. సభా నియమాలను ఉల్లంఘిస్తూ పదే పదే పోడియం వద్దకు వెళ్లి నిరసనలు తెలపడం, అరుపులు, కేకలతో సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. తాజాగా నిర్వహించిన బడ్జెట్ సమావేశాల్లోనూ సదరు ఎమ్మెల్యేల తీరు అదే విధంగా ఉన్నట్టు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ జాబితాలో కొత్తగా ఎన్నికైన ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు కొందరు సీనియర్ సభ్యులు సైతం ఉన్నారనే విమర్శలున్నాయి.
ఆధారాలు సేకరణ?
సభలో విపక్ష ఎమ్మెల్యేల ప్రవర్తనపై పూర్తి ఆధారాలు సేకరించే పనిలో స్పీకర్ కార్యాలయం ఉన్నట్టు తెలుస్తున్నది. ఏయే రోజుల్లో ఎవరు ఎలా వ్యవహరించారు? ఏ విధమైన భాష వాడారు? అనే సాక్ష్యాలను సేకరిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి సభా కార్యక్రమాలు సాగుతున్నంత సేపు లైవ్ టెలికాస్టింగ్ సహజంగా ఉంటుంది. నిరసనలు, స్లోగన్స్, పోడియం ముట్టడించిన దృశ్యాలు మాత్రం లైవ్‌లోకి వెళ్లకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ పోడియం వద్దకు వచ్చే ప్రతి ఎమ్మెల్యే కదలికలనూ చిత్రీకరించేందుకు ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఆ కెమెరాల్లో రికార్డయిన విజువల్స్‌ను ప్రస్తుతం సేకరిస్తున్నట్టు తెలిసింది. సభలో ఉపయోగించిన పరుష పదాలు సైతం కెమెరాల్లో రికార్డు అయినట్టు సమాచారం. వాటన్నింటినీ సమయం, సందర్భం ప్రకారం బహిర్గతం చేసే చాన్స్ ఉన్నట్టు తెలుస్తున్నది.
సొంత పార్టీలోనే విమర్శలు
కొందరు ఎమ్మెల్యేలు సభలో ప్రవర్తిస్తున్న తీరుపై బీఆర్ఎస్ పక్షం నుంచే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సభా సంప్రదాయాలను ఉల్లంఘించొద్దని పదే పదే సూచించినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. దూకుడుగా ప్రవర్తిస్తున్న కొత్త ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాల్సిన మాజీ మంత్రులు మౌనంగా ఉంటున్నారని, కొన్ని సార్లు సదరు ఎమ్మెల్యేలను ఎంకరేజ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్లే కొత్త ఎమ్మెల్యేలు సభలో ఇష్టానుసారంగా వ్యవరిస్తున్నారని టాక్ ఉన్నది.