Firing Crackers : బాపుకి అవమానం! విగ్రహం నోట్లో బాంబులు పెట్టి పేల్చిన ఆకతాయిలు.. వీడియో వైరల్

by Ramesh N |   ( Updated:3 Nov 2024 11:52 AM  )
Firing Crackers : బాపుకి అవమానం! విగ్రహం నోట్లో బాంబులు పెట్టి పేల్చిన ఆకతాయిలు.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దీపావళి Diwali పండుగ రోజు కొంత మంది యువత వెర్రి చేష్టలతో టపాసులు కాల్చారు. అందుకు సంబంధించిన వీడియోలు తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగా Mahatma Gandhi మహాత్మా గాంధీ విగ్రహం నోట్లో టపాసులు (లక్ష్మీ బాంబులు) పెట్టి పేలుస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. కంటోన్మెంట్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గాంధీ విగ్రహంతో ఇలాంటి చర్యలకు ఆకతాయిలు పాల్పడ్డారు. వీడియో వైరల్ కావడంతో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ krishank manne ఎక్స్ వేదికగా హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. Cantonment కంటోన్మెంట్‌లోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో గాంధీజీ విగ్రహంతో జరిగిన ఈ అసభ్య చర్యపై సుమోటోగా చర్యలు తీసుకోవాలని సీపీకి విజ్ఞప్తి చేశారు.

ఇలాంటి వికృత చర్యలు చేయడం నిజంగా మహాత్మాగాంధీని అవమానించడమేనని పలువురు నెటిజన్‌లు పోలీసులకు ట్యాగ్ చేశారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ వద్ద క్రాకర్స్ కాలుస్తూ బైక్ పై స్టంట్లు చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. వారిలో పదిమంది బైక్ రైడర్‌లపై రాయదుర్గం పోలీసులు కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి పది బైకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత రెండున్నర నెలల్లో 250 మందిపై కేసులు పెట్టిన బైక్ స్టంట్స్‌తో కొంత మంది యువత రెచ్చిపోతూనే ఉన్నారు.

Next Story

Most Viewed