Holi: ప్రకృతి ఒడిలో తెలంగాణ ప్రజలు.. విన్నూత్న రీతిలో హొలీ వేడుకలు..

by Indraja |
Holi: ప్రకృతి ఒడిలో తెలంగాణ ప్రజలు.. విన్నూత్న రీతిలో హొలీ వేడుకలు..
X

దిశ వెబ్ డెస్క్: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హొలీ పండుగ రానే వచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు రంగుల్లో మునిగి తేలుతున్నారు. ఇక అందరూ రకరకాల కృత్రిమ రంగులతో హొలీ జరుపుకుంటుంటే.. తెలంగాణాలో మాత్రం అందుకు భిన్నంగా హొలీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని నాశనం చేసే కృతిమ రంగులకంటే, సహజసిద్దమైన రంగులే మంచింది అని కొందరు గిరిజనులు పూలతో రంగులను తాయారు చేసుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా లోని గిరిజనలు అడవిలో దొరికే మోదుగ పూలను ఉపయోగించి రంగులను తాయారు చేయనున్నారు. మొదటగా అడవిలో దొరికే మోదుగ పూలను సేకరిస్తారు. ఆ తరువాత వాటిని ఉపయోగించి సహజసిద్ద పద్దతిలో రంగులను తాయారు చేస్తారు. ఇలా తాయారు చేసిన రంగులను వాడడంవల్ల ఎలాంటి హాని వాటిల్లే అవకాశం ఉండదని తెలుస్తోంది. పర్యావరణాన్ని, అలానే హొలీ ఆడే మనుషుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గిరిజనలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story