- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్ అరెస్ట్‌పై స్పందించిన ఆయన భార్య.. పోలీసులు ఎలా వ్యవహరించారంటే..?
దిశ, కరీంనగర్ బ్యూరో: ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తన తల్లిని కొల్పొయి దుఃఖంలో ఉన్నామని, ఆమె చిన్న కర్మకు హాజరుకావడానికి వస్తే ఇలా బలవంతంగా అరెస్ట్ చేస్తారా అని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కరీంనగర్ఎంపీ బండి సంజయ్ భార్య అపర్ణ అన్నారు. సంజయ్అత్తమ్మ, తన తల్లి ఇటీవల మరణించగా బుధవారం ఉదయం 6 గంటలకు చిన్న కర్మకు హాజరు అయ్యేందుకు సంజయ్వచ్చారని అపర్ణ తెలిపారు. 7గంటల తరువాత సంజయ్అందుబాటులోనే ఉండే వారని రాత్రి పూట వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ వచ్చిందని ఆమె ప్రశ్నించారు. అర్ధరాత్రి 12–30 గంటలు దాటిన తరువాత సుమారు 40 మంది పోలీసులు ఇంటికి వచ్చారని పేర్కొన్నారు. ఒక పార్లమెంట్‌సభ్యుడు అయిన సంజయ్‌ని అర్ధరాత్రి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో పోలీసులు చెప్పాలని అపర్ణ డిమాండ్ చేశారు. పోలీసులను అడిగితే ముందస్తు అరెస్ట్అని చెప్పారని, సంజయ్హార్ట్పేషెంట్కావడంతో ప్రతి రోజు నాలుగు టాబ్లెట్స్ తప్పకుండా వేసుకోవాలని, మెడిసిన్ ఇద్దామని వస్తే ఇవ్వనీయకుండా గుంజుకొని తీసుకెళ్లారని ఆమె వాపోయారు. ఒక ప్రజాప్రతినిధి పట్ల పోలీసులు ఇలాగే ప్రవర్తిస్తారా అని అపర్ణ ప్రశ్నించారు.