- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRSలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. కుర్చీలు విసురుకున్న MLC, మాజీ ఎమ్మెల్యే
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కూడా బీఆర్ఎస్‌లో వర్గపోరు కలకలం రేపింది. పార్లమెంట్ ఎన్నికల వేళ చేవెళ్ల లోక్ సభ సన్నాహక సమావేశంలో వర్గపోరు బయటపడింది. తెలంగాణ భవన్ లో శుక్రవారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహేందర్ రెడ్డి మాట్లాడే సమయంలో రోహిత్ రెడ్డి వర్గం నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల పరస్పర నినాదాలతో వాతావరణం వేడేక్కింది. ఇక పరస్పరం పట్నం మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి కుర్చీలు విసురుకోవడంతో అక్కడున్న ముఖ్య నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు షాక్ అయ్యారు. ఇరు వర్గాలకు మాజీ మంత్రి హరీష్ రావు సర్దిచెప్పారు. మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డితో హరీష్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బహిరంగంగా సమీక్ష సమావేశంలో గొడవపడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న హరీష్ రావు ఇద్దరు నేతలకు స్పష్టం చేశారు. ఈ భేటీలో సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.