- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MLA poaching case: బ్రేకింగ్: మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు తదుపరి విచారణను సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సిట్ విచారణపై నమ్మకం లేదని.. సీబీఐకు అప్పచెప్పాలంటూ గతంలో బీజేపీ, ముగ్గురు నిందితులు, నలుగురు ప్రతిపాదిత నిందితుల తరుఫున దాఖలైన వేర్వేరు పిటిషన్లను సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు వాదనలను ఇటీవల ముగించింది. ఇంతకాలం ఈ కేసు తీర్పును రిజర్వులో ఉంచిన హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు.. మిగిలిన పిటిషన్లను పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తదుపరి విచారణను సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా, ఇప్పటి వరకు ఈ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేస్తోంది. తాజా హైకోర్టు ఆదేశాలతో ఇప్పటి నుండి మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేపట్టనుంది.
ఇవి కూడా చదవండి : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్ట్ సంచలన తీర్పు.. సిట్ కీలక నిర్ణయం..!