కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు

by Sathputhe Rajesh |
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు
X

దిశ, మల్యాల : కొండగట్టు ఆంజనేయస్వామిని శనివారం హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ కె. లలితలకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం జడ్జి‌లు స్వామివారితో పాటు, అమ్మవారి ఆలయం, కాల భైరవ ఆలయం దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి వెంకటేష్ వారిని శాలువలతో సన్మానించారు.

ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల డీఎస్పీ ప్రకాష్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెoట్ సునీల్, ఆలయ స్థానాచార్యులు కపీందర్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి, మారుతి ప్రసాద్, అర్చకులు లక్ష్మణ్ స్వామి, హైకోర్టు సిబ్బంది, పోలీసులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed