భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

by sudharani |
భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిర్మల్ జిల్లా భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. ఈ మేరకు మార్చి 5న లాంగ్ మార్చుకు అనుమతి ఇవ్వాలని మంగళవారం జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశించింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని, ర్యాలీలో 500 మంది మాత్రమే పాల్గొనాలని సూచించింది. క్రిమినల్ హిస్టరీ లేనివాళ్లే ఈ ర్యాలీలో పాల్గొనాలని, ర్యాలీ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని ఆంక్షలు విధించింది.

ప్రార్థన స్థలాలకు 300 మీటర్ల దూరంలో ర్యాలీ కొనసాగాలని పేర్కొంది. మసీదు పరిసరాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుకు ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. కాగా ఆర్ఎస్ఎస్ ర్యాలీకి పోలీసులు మొదట అనుమతి ఇవ్వలేదు. పర్మిషన్ ఇస్తే శాంతి భద్రత సమస్య తలెత్తుతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని పేర్కొంటూ పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. అనుమతి నిరాకరణపై ఆర్ఎస్ఎస్ హైకోర్టును ఆశ్రయించగా తాజాగా షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.

Advertisement

Next Story

Most Viewed