- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రయాణికులకు BIG అలర్ట్.. ఈ మార్గం గుండా వెళ్తే సంక్రాంతి ముగిశాకే ఇంటికి?
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండక్కి ఉన్న క్రేజ్ మరే పండుగకు ఉండబోదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలో ఎక్కడ స్థిరపడ్డా సంక్రాంతికి అంతా ఊరికి వస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగను ఘనంగా నిర్వహించారు. ఒక వేడుకలా నాలుగైదు రోజులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే, నగరాల్లో ఉంటున్న వారంగా ఒక్క సారిగా గ్రామాలకు సిద్ధమవడంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు రెండ్రోజులుగా కిక్కిరిసిపోతున్నాయి. మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ కావడంతో బస్సుల్లో ప్రయాణించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణ ప్రాంగణాలతో పాటు టోల్‌ప్లాజాల వద్ద కూడా భారీగా రద్దీ నెలకొంది.
ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ హైవైపే ఉన్న పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు సమాచారం. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు వార్తలు వినవస్తున్నాయి. దీంతో ఆ ట్రాఫిక్‌లో చిక్కుకున్న ప్రయాణికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ మార్గం గుండా వెళ్తే సంక్రాంతి ముగిశాకే మీరు ఇంటికెళ్లేది? అంటూ కామెంట్లు పెడుతూ వెనకాల వచ్చే ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు.