- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరి కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ.. BRS శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ (సోమవారం) విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇవాళ మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేయనుంది. అయితే, కేసు కీలక దశలో ఉందని.. ఈ సమయంలో ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని దర్యాప్తు సంస్థలు బలంగా వాదిస్తోన్న నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సస్పెన్స్‌గా మారింది.
కవిత బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో ఆమెకు బెయిల్ వస్తుందా.. రాదా అని బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం కోర్టు అనుమతితో ఆమెను కస్టడీకి తీసుకుని రెండు దర్యాప్తు సంస్థలు విచారించాయి. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా కవిత ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ విచారణ ఉన్న నేపథ్యంలో కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అని స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తి నెలకొంది.