- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాథ్ సే హాథ్ జోడో యాత్ర: ఫుట్ బాల్ ఆడిన రేవంత్ రెడ్డి
దిశ ప్రతినిధి, నిజామాబాద్: హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో భాగంగా నిజామాబాద్ అర్బన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడారు. బుధవారం ఉదయం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామర్తి గోపి ఆధ్వర్యంలో అర్గుల్ రాజారాం మెమోరియల్ హాథ్ సే హాథ్ జోడో ఫుట్ బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించారు.
ఫుట్‌బాల్ పోటీలను ప్రారంభిచిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపీలు ఆయనతో పాటు ఫుట్ బాల్ ఆడారు. కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి క్రీడాకారులను అభినందించారు. క్రీడాకారులు కాంగ్రెస్ నాయకులు కేరింతల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ ఆహ్లాదంగా సాగింది.