- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR : రాష్ట్రంలో ప్రోటోకాల్ నిబంధనలు ఏమైనా మార్చారా? సీఎస్‌కు కేటీఆర్ ప్రశ్న
దిశ, డైనమిక్ బ్యూరో: తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి నీటి విడుదలపై వివాదం ఏర్పడింది. నీటీ విడుదల కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడిని అధికారులు ఆహ్వానించారు. ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సంపత్ కుమార్‌ను కూడా అధికారులు ఆహ్వానించారని, ఆయన వచ్చే వరకు ఆగాలని అధికారులు ఎమ్మెల్యేకు సూచించారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తన కోసం ఎందుకు ఆగాలని ఎమ్మెల్యే నీటిని విడుదల చేశారని, తానులేకుండా విడుదల చేశారని కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ గేట్లు మూసివేశారని ఎమ్మెల్యే.. అతని అనుచరులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఓడిన కాంగ్రెస్ నేతలను అధికారిక కార్యక్రమాలకు ఎలా పిలుస్తారు? రాష్ట్రంలో ప్రోటోకాల్ నిబంధనలు ఏమైనా మార్చారా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాపాలనలో రోజూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అవమానాలే ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే విజయుడిని అధికారులు అవమానించారని ఆరోపించారు. అధికారుల అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ట్వీట్ ట్యాగ్ చేశారు.