- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Harish Rao : టీటీడీ ఛైర్మన్ కు హరీష్ రావు కీలక రిక్వెస్ట్

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం(Sri Venkateshwara Swami Temple) సిద్దిపేటలో ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(BRS MLA Harish Rao) టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి(TTD Chairman BR Nayudu)ని కోరారు. మంగళవారం తిరుపతి వెళ్లిన హరీశ్ రావు టీటీడీ బోచైర్మన్ బీఆర్ నాయుడిని కలిశారు. సిద్దిపేట కోమటి చెరువు ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయ నిర్మాణం చేపట్టాలని, ఆలయ నిర్మాణం కోసం ఇప్పటికే సిద్దిపేట కోమటి చెరువు(Siddipeta Komati Cheruvu) ప్రాంతంలో 5 ఎకరాల 10 గుంటల స్థలాన్ని మంజూరు చేశామని టీటీడీ చైర్మన్‌తో హరీశ్‌రావు తెలిపారు. గతంలోనే టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు సిద్దిపేటలో పర్యటించి ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. దానికి అనుగుణంగా ఆలయ నిర్మాణ నమునా, డిజైన్స్ ను రూపొందించారని వివరించారు. వచ్చే టీటీడీ బోర్డు మీటింగ్‌లో సిద్దిపేటలో వెంకటేశ్వర దేవాలయ నిర్మాణానికి ఆమోదం తెలిపి, మీరే ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా బీఆర్ నాయుడిని కోరారు. అందుకు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. వెంటనే చీఫ్ ఇంజనీర్ అధికారి, సంబంధిత అధికారులను పిలిచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రజలు తమ ఇలవేల్పుగా కొలుస్తారని, అలాంటి ఆలయం సిద్దిపేటలో నిర్మించడం తమ అదృష్టమని హరీశ్‌రావు అన్నారు.