Harish Rao : ప్రజాభవన్‌లో 16వ కేంద్ర ఆర్థిక సంఘానికి హరీష్ రావు కీలక సూచనలు

by Ramesh N |
Harish Rao : ప్రజాభవన్‌లో 16వ కేంద్ర ఆర్థిక సంఘానికి హరీష్ రావు కీలక సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అత్యధిక తలసరి ఆదాయం ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణలో 16 వ కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటిస్తోంది. అరవింద్ పనగారియా నేతృత్వంలో కమిషన్ ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ప్రజాభవన్‌లో సమావేశాలు నిర్వహిస్తోంది. 16వ ఆర్థిక సంఘం సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ తరఫున పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 16వ ఆర్థిక సంఘం సమతుల్యత పాటించాలని సూచించారు. వెనుకబడ్డ రాష్ట్రాలను ఆదుకోవాలని, బాగా పనిచేస్తున్న మా లాంటి రాష్ట్రాలను ప్రోత్సహించాలని 16వ ఆర్థిక సంఘానికి నొక్కి చెప్పినట్లు వెల్లడించారు.

అదేవిధంగా రాష్ట్రాలకు నిధులు ఇవ్వడానికి కొన్ని మార్క్స్ పెట్టుకున్నారని, తలసరి ఆదాయం 45 శాతం మార్కులు పెట్టుకున్నారని, అంటే ఏ రాష్ట్రానికి అయితే అత్యధికంగా తలసరి ఆదాయం ఉంటదో వారికి సున్నా అని, తక్కువగా తలసరి ఆదాయం ఉన్న వారికి 45 శాతం ఉంటుందని అన్నారు. ఇది అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు అత్యధిక తలసరి ఆదాయం ఉంటదని, ఈ క్రమంలోనే 45 శాతాన్ని 35 తగ్గించాలని వారికి చెప్పినట్లు స్పష్టంచేశారు. పన్నులు వసూలు చేయడంలో ఎక్కడ కూడా రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో అవినీతి లేకుండా ప్రతీ పైసను రాష్ట్ర ఖజానాకు వచ్చేట్లు చేస్తే.. రెండున్నర శాతం వెయిటేజీ మాత్రమే ఉందన్నారు. తాము బాగా పనిచేస్తున్నామని, కొన్ని రాష్ట్రాల్లో అసలు పన్నులే వాసులు చేయదని వారికి మాత్రం లాభం జరుగుతోందన్నారు. కానీ తెలంగాణ నష్టమవుతోందన్నారు.

పన్నులు బాగా వసూలు చేసే రాష్ట్రాలకు ఇచ్చే వెయిటేజ్‌ను రెండున్నర నుంచి పది శాతానికి పెంచాలన్నారు. దీంతో రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతదని ఆర్థిక సంఘం దృష్టికి తెచ్చినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల గ్రాంట్‌ను పెంచాలన్నారు. రూరల్, అర్బన్ లోకల్ బాడీస్‌కు 50 శాతం గ్రాంట్లు పెంచాలని కేంద్ర ఆర్థిక సంఘాన్ని కోరినట్లు తెలిపారు. అర్బన్ ప్రాంతాలకు గ్రాంట్స్ తగ్గుతున్నాయని చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కు కేంద్రం రూ. 40 వేల కోట్లు కేటాయించాలని కోరామన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. 15 వ ఆర్ధిక సంఘం, నీతి అయోగ్ చెప్పిన కూడా మీషన్ భగీరథ‌కు నిధులు కేటాయించలేదని 16వ ఆర్ధిక సంఘాన్ని కోరినట్లు తెలిపారు. దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం రిపోర్టులను తొక్కిపెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed