Harish Rao: కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు తీర్పు.. స్పందించిన హరీష్ రావు

by Gantepaka Srikanth |
Harish Rao: కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు తీర్పు.. స్పందించిన హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్‌(KTR)ను 10 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు(Telangana High Court) ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్(BRS) కీలక నేత, ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) స్పందించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అక్రమంగా బనాయించిన కేసులో కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు చెప్పిందని అన్నారు. ఇది డొల్ల కేసు అని హైకోర్టే చెప్పిందని తెలిపారు. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. తొలి అడుగులోనే కేటీఆర్ విజయం సాధించారని అన్నారు. ఫార్ములా ఈ-రేస్ ద్వారా రూ.600 కోట్లు వెళతాయని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్రజలకు అవాస్తవాలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తమ వల్ల కాదని.. రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రానికి రూ.600 కోట్ల నష్టం జరిగిందని అన్నారు. బీఆర్ఎస్‌పై బురదజల్లేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో అబద్ధాలు చెప్పి.. తమను మాట్లాడనివ్వకుండా చేశారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed