Harish Rao: ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయకపోతే అవిశ్వాసం పెడతాం.. హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

by Shiva |
Harish Rao: ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయకపోతే అవిశ్వాసం పెడతాం.. హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో యుద్ధ వాతావరణం నెలకొంది. స్పీకర్‌ ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ (BRS) సభ్యుడు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Former Minister Jagadish Reddy) అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సభలో అధికార పార్టీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. వెంటనే స్పీకర్‌కు సభ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని మంత్రులు (Ministers), ఎమ్మెల్యే (MLA's)లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) క్లారిటీ ఇచ్చారు. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ (Speaker Prasad Kumar)ను జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అవమానించలేదని అన్నారు. ‘సభ మీ ఒక్కరిది కాదు.. అందరిది అని’ మాత్రమే అన్నారని స్పష్టం చేశారు. ‘మీ’ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA's)లు సభలో ఎందుకు నిరసన చేశారో.. సభను ఎందుకు వాయిదా వేశారో తెలియదని ఎద్దేవా చేశారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయకపోతే అవిశ్వాసం పెడతామని హరీశ్ రావు అన్నారు.

Next Story

Most Viewed