- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భవనం పైనుంచి కింద పడి కార్మికుడు మృతి.. నోటీసులు జారీ చేసిన ఆగని పనులు!

దిశ,ఖైరతాబాద్ : అక్రమ నిర్మాణాలపై జిహెచ్ఎంసి అధికారులు ఉక్కు పాదం మోపారు.జీహెచ్ఎంసి ఖైరతాబాద్ సర్కిల్ 17 లోని ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలోని అక్రమ నిర్మాణం భవనాన్ని జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేత చేపట్టారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జీ ప్లస్ ఫోర్ అంతస్తులకు అనుమతి పొంది సెల్లార్ తో పాటు ఇంకా అదనంగా మరో రెండు అంతస్తుల తో మొత్తం 6 అంతస్తుల నిర్మాణం చేపట్టగా, గత నెలలో 5 , 6 అంతస్తులను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
నిర్మాణ పనులను వెంటనే ఆపాలని పలుమార్లు నోటీసులు జారీచేసిన భవన యజమాని వాటిని దిక్కరిస్తూ నిర్మాణాలు చేపడుతుండగా మరోసారి జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి అధికారులు పోలీసులు బందోబస్తుతో మంగళవారం సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ లను మొత్తం జేసీబీ తో నేలమట్టం చేశారు.గతంలో ఇదే అక్రమ నిర్మాణం జరుగుతుండగా ఒక కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. భవన యజమానిపై , బిల్డర్ లపై ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదు అయింది. పనులు నిలిపి వేయాలని అధికారులు నోటీసులు జారీచేసిన సదరు భవన యజమాని అధికారుల హెచ్చరికలు పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ అదే అక్రమ నిర్మాణం నిర్మిస్తుండడం వల్ల జేసీబీ తో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు.