- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అప్పుడు గీరాల్సిన అగ్గిపుల్ల ఇప్పుడు గీరిన హరీష్ రావు’
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ‘రైతుబంధు’ సాయం పంపిణీకి ఈసీ బ్రేక్ వేసింది. దీనికి కారణాన్ని సైతం స్పష్టంగా ఈసీ తన ఉత్తర్వుల్లో మెన్షన్ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పలానా సమయానికి, పలానా తేదీన రైతుబంధు డబ్బులు పడుతాయని ఆ సమయంలో మీ ఫోన్లు టింగ్ టింగ్ అంటూ మోగుతాయని కామెంట్ చేశారు. అయితే హరీష్ రావు కామెంట్లను సీరియస్ గా తీసుకున్న ఈసీ నిబంధనలను ఉల్లంఘించారని రైతుబంధుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొంది.
తాజాగా ఈసీ నిర్ణయంపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. కాంగ్రెస్ నేతలు రైతుల నోటికాడి ముద్దను లాక్కున్నారని హస్తం పార్టీ నేతలపై ఆరోపణలు చేశారు. కవిత వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈసీ స్పష్టంగా హరీష్ రావు పేరును మెన్షన్ చేసిన తర్వాత కూడా మళ్లీ కాంగ్రెస్‌ను బద్నాం చేయడం ఏంటని మండి పడుతున్నారు. కవిత వ్యాఖ్యలపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘నాడు గీరాల్సిన అగ్గిపుల్ల ఇప్పుడు గీరిండు.. అగ్గిపెట్టె మచ్చ’ అంటూ హరీష్ రావును ఉద్దేశించి కామెంట్ చేశాడు. ప్రస్తుతం నెట్టింట ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి.