- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao: ప్రజాపాలన అంటే మాజీ సర్పంచ్‌లను అరెస్ట్ చేయడమా.. హరీశ్‌రావు హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: పెండింగ్ బిల్లు (Pending Bills)లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచ్‌లు ఇవాళ పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే, వారి అక్రమ అరెస్ట్‌లను ఖండిస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ‘X’ (ట్విట్టర్) వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ని కలిసేందుకు వచ్చిన మాజీ సర్పంచ్‌లను అరెస్ట్ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఓ వినతిపత్రం ఇవ్వాలని మాజీ సర్పంచ్‌లు అంతా కలిసి హైదరాబాద్‌కు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికమని ఫైర్ అయ్యారు.
అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం తాకట్టు పెట్టి వారంతా గ్రామ అభివృద్ధికి కృష్టి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు డబ్బులివ్వమని అడిగితే ప్రభుత్వం అక్రమ అరెస్ట్‌కు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచ్‌లను అరెస్టులు చేయడమేనా.. అని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ.. చిన్న పనులు చేసిన మాజీ సర్పంచ్‌లకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అక్రమంగా నిర్బంధించిన, అరెస్ట్ చేసిన మాజీ సర్పంచులు బేషరతుగా విడుదల చేయాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా పెండింగ్‌లో బిల్లులను తక్షణమే విడుదల చేయాలని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.