- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఆ ఇద్దరు జర్నలిస్టులకు మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై రేవంత్ అనుచరులు దాడి చేయడాన్ని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో భాగంగా అక్కడికి గురువారం వెళ్లిన జర్నలిస్టులు సరిత, విజయ రెడ్డిల నుంచి కెమెరాలు లాక్కొని, భౌతిక దాడికి పాల్పడటం దుర్మార్గం అన్నారు. ఫోన్‌లో వారితో మాట్లాడి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని, ప్రశ్నించే హక్కులను కాలరాస్తున్నారని, ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో నిరంకుశత్వం రాజ్యమేలుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సమాజ హితాన్ని కాంక్షించే జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతుండటం ఆందోళనకరం అన్నారు. జర్నలిస్టుల దాడుల పట్ల ప్రజాస్వామికవాదులు స్పందించాలని కోరారు.
దాడి హేయనీయం : టీజేఎఫ్
రైతు రుణమాఫీపై వాస్తవాలను ప్రజలకు చూపేందుకు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలస్టులపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు పల్లె రవికుమార్ తెలిపారు. గురువారం మీడియా ప్రకటన విడుదలచేశారు. మహిళా జర్నలిస్టులపై భౌతిక దాడికి పాల్పడిన ఘటన ఆందోళన కలిగిస్తుందన్నారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు ప్రయత్నిస్తే దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్న వారి గొంతులను నొక్కేయడమేంటని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాపాలన అని మండిపడ్డారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ కూడా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టులపై దాడి హేయనీయం
జర్నలిస్టులపై దాడి హేయనీయమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. కొండారెడ్డిపల్లి ఏమైనా నిషేదిత ప్రాంతమా అక్కడి ఎవ్వరు వెళ్లకూడదా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ చేసిన అంకెల గారెడీ బయటపడుతుందోననే భయంతోనే మహిళా జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.