- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Borrow: వారంలో ఆ రోజు అప్పు అస్సలు తీసుకోకండి.. తీసుకుంటే డేంజర్లో పడ్డట్టే అంటున్న జ్యోతిష్య నిపుణులు

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా మనం ఏదొక సందర్భంలో అప్పు చేస్తుంటాము. ముఖ్యంగా, ఇల్లు కొనడానికి, హాస్పిటల్ ఖర్చుల కోసం, ఇంట్లో వస్తువుల కొనడం కోసం ఇలా రుణం తీసుకుంటూ ఉంటారు. అయితే, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వారంలో ఈ రోజుల్లో అప్పు చేయకూడదని గట్టిగా చెబుతున్నారు.. అలా కాదని అప్పు చేస్తే డేంజర్లో పడ్డట్టే అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడు EMI, క్రెడిట్ కార్డ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అందుకే, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే వాడేస్తున్నారు. కానీ అప్పు ఎప్పుడూ ప్రశాంతతను ఇవ్వదు. అది చెల్లించే వరకు నిద్ర పట్టదు.అలాగే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అప్పు తీసుకోవడానికి ఒక రోజు, మంచి సమయం ఉంటుందని చెబుతున్నారు. కానీ, సరైన సమయంలో రుణం తీసుకోకపోతే, తిరిగి చెల్లించలేని పరిస్థితులు వస్తాయని, అలాగే బ్యాడ్ టైంలో తీసుకుంటే ఆ బరువు కొన్నేళ్ల పాటు మోయాల్సిందే అని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళ, బుధ, శనివారాల్లో అప్పు తీసుకుంటే ఎప్పటికీ తీరదంట. వీటిలో మంగళవారం తీసుకుంటే చిక్కుల్లో పడతారు. అందుకే లోన్ తీసుకోడానికి.. లేదా అప్పుపై ఏదైనా వస్తువులు కొనడానికి ఈ మూడు రోజులు వెళ్లకండని అంటున్నారు. ఒక వేళ మీకు అత్యవసరమైతే సోమవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం డబ్బు పొందవచ్చని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు