పోటాపోటీగా షేర్ అవుతున్న ఓట్లు.. తీన్మార్ మల్లన్న ఆధిక్యత ఎంతో తెలుసా?

by Gantepaka Srikanth |   ( Updated:2024-06-07 12:25:33.0  )
పోటాపోటీగా షేర్ అవుతున్న ఓట్లు.. తీన్మార్ మల్లన్న ఆధిక్యత ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ - నల్లగొండ - ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠంగా సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు పోటాపోటీగా ఓట్ షేర్ అవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,23,709 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 1,04,846 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డికి 43,712 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 29,915 పోల్ అయ్యాయి. మ్యాజిక్ ఫిగర్‌కు 1,55,095 ఓట్లు కావాల్సి ఉంది. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మ‌రికొద్ది గంట‌ల్లో పూర్తి స్థాయి ఫ‌లితం వెలువ‌డ‌నుంది. ఇప్పటివరకు మొత్తం 48 మంది సభ్యుల ఎలిమినేషన్ పూర్తి అయింది. తాజాగా బీజేపీ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డిని కూడా అధికారులు ఎలిమినేట్ చేశారు. మొత్తంగా తీన్మార్ మల్లన్న 19 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గెలుపు సునాయాసం కానుంది. విజేత ఎవరో కాసేపట్లో తేలనుంది.

Advertisement

Next Story

Most Viewed