- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం వేకువజామున తోమాల, అర్చన సేవల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని దేవ దేవుడిని దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం గవర్నర్ కు ఆలయ పండితులు రంగనాయకుల మంటపంలో వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుండగా..6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టికెట్లులేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.50 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.
Advertisement
Next Story