బిగ్ న్యూస్: TSPSC పేపర్ లీక్ వ్యవహారంలో సంచలన నిర్ణయం దిశగా గవర్నర్..?!

by Satheesh |
బిగ్ న్యూస్: TSPSC పేపర్ లీక్ వ్యవహారంలో సంచలన నిర్ణయం దిశగా గవర్నర్..?!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ మధ్య వ్యవహారం హాట్ హాట్‌గా సాగుతున్న వేళ టీఎస్‌పీఎస్సీ వ్యవహారం, విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు తనను ఆవేదనకు గురి చేస్తున్నాయని తనతో భేటీ కావడానికి వచ్చిన టీ-కాంగ్రెస్ నేతలతో చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై బుధవారం టీ కాంగ్రెస్ నేతలు గవర్నర్ కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారితో గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలతో సిరిసిల్లలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ఘటనను గవర్నర్ ప్రస్తావించారని, ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లను పరిశీలిస్తున్నానని తన వరకు వచ్చిన ఫిర్యాదులుపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటానని వారితో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నందున రాజ్యాంగానికి లోబడి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని అందువల్లే లీగల్ ఒపీనియన్ ప్రకారం తన నిర్ణయం ఉంటుందని గవర్నర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రస్తుత టీఎస్‌పీఎస్సీ బోర్డును తప్పించే చర్యలు తీసుకుని విచారణ పారదర్శకంగా చేస్తారని భావించినప్పటికీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదని అందువల్ల విచారణ పూర్తి అయ్యే వరకు టీఎస్ పీఎస్సీని రద్దు చేసే విశేష అధికారం గవర్నర్‌కు ఉంటుందని రేవంత్ రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే బోర్డు రద్దు ప్రభుత్వం ఎటువంటి ముందడుగు వేయకపోతే ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహాతో గవర్నరే డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా అనేది ఉత్కంఠ రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed