Davos: దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం.. దిగ్గజ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు

by Ramesh N |   ( Updated:2025-01-22 13:00:50.0  )
Davos: దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం.. దిగ్గజ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Davos) దావోస్‌లో (World Economic Forum) వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రెండో రోజున వివిధ సదస్సులు, సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) బృందం పాలుపంచుకుంటుంది. దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం తెలంగాణ రైజింగ్ కుదుర్చుకుంది. యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈవోతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్‌లలో ఒకటైన యూనిలీవర్‌ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ (Unilever) యూనిలివర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటుకు అంగీకరించింది. తెలంగాణలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దావోస్‌లోని తెలంగాణ పెవీలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమల శాఖ అధికారులు యూనిలివర్ సీఈవో హీన్ షూమేకర్, ఆ కంపెనీ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో వ్యాపార అవకాశాలు, పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను చర్చించారు.

Next Story

Most Viewed