- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Digital Media : డిజిటల్ మీడియాకు కూడా ప్రభుత్వ ప్రకటనలు!

దిశ, వెబ్ డెస్క్ : డిజిటల్ మీడియా(Digital Media) జర్నలిస్టుల(Journalists)కు అక్రిడిటేషన్లు(Accreditations), డిజిటల్ మీడియాకు ప్రభుత్వ ప్రకటన(Government Advertisements)లు ఇచ్చే విషయాన్ని సానుకూలంగా పరిశీలిస్తున్నామని..త్వరలోనే ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐ అండ్ పీఆర్) ప్రత్యేక కమిషనర్ ఎస్. హరీష్(I&PR -Special Commissioner S. Harish) హామీ(Assurance) ఇచ్చారు. డిజిటల్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు..జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు స్వామి ముద్దం, పోతు అశోక్ లు లు హరీష్ ను కలిసి వినతి పత్రం అందించారు.
ప్రతిక్షణం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆన్ లైన్ న్యూస్ మీడియా (వెబ్ సైట్, యాప్)కు అక్రిడిటేషన్లు, ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి సహకరించాల్సిన అవసరముందని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఐఅండ్ పీఆర్ కమిషనర్ ఎస్. హరీష్ సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఆన్ లైన్ డిజిటల్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియకు సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందిస్తామని కమిషనర్ తెలిపారు.
అనంతరం డిజిటల్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు స్వామి ముద్దం మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా డిజిటల్ మీడియా రంగం కీలక పాత్ర వహిస్తుందన్నారు. డిజిటల్ మీడియాలో అనేక మంది జర్నలిస్టులు పని చేస్తున్నారని.. ఆన్ లైన్ న్యూస్ మీడియాకు గుర్తింపును ఇస్తూ ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి సహకరించాలని కమిషనర్ ను కోరడం జరిగిందని తెలిపారు. ఇందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించి..త్వరలోనే అందుకు చర్యలు తీసుకుని ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం సంతోషకరమన్నారు. డిజిటల్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు..జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇచ్చేందుకు గైడ్ లైన్స్ రూపొందిస్తామని చెప్పడం పట్ల వారు కమిషనర్ కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.