Peddapalli: తెలంగాణలో పట్టాలు తప్పిన రైలు

by Gantepaka Srikanth |
Peddapalli: తెలంగాణలో పట్టాలు తప్పిన రైలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లో గూడ్స్ రైలు(Goods Train) పట్టాలు తప్పింది. పెద్దపల్లి - రాఘవాపూర్(Peddapalli - Raghavapur) దగ్గర మంగళవారం రాత్రి సమయంలో ఓవర్ లోడ్ కారణంగా ఆరు గూడ్స్ భోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది(Railway Staff) మరమ్మతులు ప్రారంభించింది. గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతుందని.. బుధవారం ఉదయం వరకు రైళ్ల రాకపోకలు కొనసాగే అవకాశం లేదని అధికారులు తెలియజేశారు. ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

Next Story

Most Viewed