రెండు రంగుల్లో గోదావరి నది ప్రవాహం

by Y. Venkata Narasimha Reddy |
రెండు రంగుల్లో గోదావరి నది ప్రవాహం
X

దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం పుష్కర ఘాట్ త్రివేణి సంగమం వద్ద గోదావరి వరద ప్రవాహం రెండు రంగుల్లో సాగుతూ చూపరులను ఆకట్టుకుంటుంది. కాళేశ్వరం సందర్శనకు, గోదావరి పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులు ఎగువ నుంచి వచ్చే గోదావరి, ప్రాణహిత నదుల కలయిక వద్ద ద్వి వర్ణాల్లో సాగుతున్న గోదావరి ప్రవాహాలను ఆసక్తిగా తిలకిస్తూ పరవశిస్తూ తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించుకుని మురిసిపోతున్నారు. మహారాష్ట్రలో ఆవిర్భవించిన గోదావరి, ప్రాణహిత నదులు కాళేశ్వరం వద్ద అంతర్వాహినిగా కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి వరద నీలి రంగులో.. ప్రాణహిత వరద ఎరుపు రంగులో ప్రవహిస్తూ సంగమిస్తూ సముద్రుడి వైపు సాగిపోతున్న అరుదైన అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed