Yadagirigutta : యాదగిరిగుట్టలో ఘనంగా గిరి ప్రదక్షిణ

by Y. Venkata Narasimha Reddy |
Yadagirigutta : యాదగిరిగుట్టలో ఘనంగా గిరి ప్రదక్షిణ
X

దిశ, వెబ్ డెస్క్ : యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ గిరి ప్రదక్షిణ(Giri Pradakshina)శుక్రవారం వైభవంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకుని నిర్వహించే గిరి ప్రదక్షిణ ఈసారి కార్తీక మాసంలో రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నమో నారసిహం, గోవింద నామస్మరణలతో యాదగిరిలు మారుమ్రోగాయి. గిరి ప్రదక్షిణను నారసింహ పాదాల వద్ద ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఈవో భాస్కర్ రావులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.

అటు ప్రధానాలయంలో స్వామివారికి స్వాతి నక్షత్ర పూజలు, అభిషేకాలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. స్వామివారి దర్శనం కోసం, కార్తీక మాసం సత్యనారాయణ వ్రతాల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. గిరి ప్రదక్షిణ అనంతరం వైకుంఠ ద్వారం వద్ధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఏటా కార్తీక మాసంలో దేవస్థానం తరుపున నిర్వహించే తులసీ దామోదర కల్యాణోత్సవం, సత్యనారాయణ వ్రతం, వన భోజనాలును మల్లాపురం తోటలో ఘనంగా నిర్వహించారు.

Advertisement

Next Story